News

చెన్నమనేనికి అస్వస్థత


కమ్యూనిస్ట్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు సోమవారం కాలు జారి పడిపోవడంతో సోమాజిగూడలోని యశోద దవాఖానాలో చికిత్స నిమిత్తంచేరారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న ఆయన బాత్‌రూంలో కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన దవాఖానాకు తరలించారు. ఆయనకు రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేయనున్నట్లు సమాచారం.